Header Banner

మందుబాబులకు బిగ్ షాక్.. ఇక ఆ బ్రాండ్ల మద్యాన్ని నియంత్రించే దిశగా! బార్ల పాలసీలో కొత్త పేజీ!

  Sat Apr 19, 2025 14:26        Politics

ఏపీలో మద్యం ద్వారా ఆదాయం పెరిగింది. గత ఆర్దిక సంవత్సరంలోనే 14 శాతం పెరుగుదల నమోదు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్రాండెడ్ మద్యంతో పాటుగా రూ 99 కే క్వార్టర్ అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, అనూహ్యంగా ఆదాయం పెరిగింది. మద్యం పాలసీలోనూ మార్పులు తెచ్చారు. అయతే, ఇప్పుడు రూ 99 క్వార్టర్ మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ కొన్ని మార్పులు ప్రతిపాదించింది. అదే సమయంలో కొత్త బార్ల పాలసీ పైన కసరత్తు జరుగుతోంది.

పెరిగిన ఆదాయం
ఏపీ ఖజనాకు మద్యం ఆదాయం బాగా పెరిగింది. ఎక్సైజ్ అధికారుల లెక్కల ప్రకారం 2023-24 లో మద్యంపై రూ.25,082 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది 14 శాతం పెరిగి రూ.28,842 కోట్లకు ఆదాయం చేరింది. గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. మద్యం దుకాణాలు టెండర్ల విధానంలో కేటాయించారు. జాతీయ కంపెనీలు తయారు చేసే క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యల వల్ల పిచ్చి బ్రాండ్లు కనుమరుగవడంతో పాటు భారీగా ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్‌ శాఖకు ఆదాయ లక్ష్యం మరింత పెరిగింది. 2024-25లో పరిమాణం (సీసాలు) పరంగా చూస్తే అమ్మకాలు 9.1 శాతం పెరిగాయి.

రూ 99 మద్యం పై నియంత్రణ
తాజా గణాంకాల మేరకు ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.3,760 కోట్ల మేర రాబడి పెరిగింది. ఇక, 2023-24లో 4.55 కోట్ల కేసుల మద్యం అమ్మితే, 2024-25లో 4.97 కోట్ల కేసుల మద్యం అమ్మారు. లిక్కర్‌లో 7.38 శాతం, బీరులో 14.13 శాతం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై వచ్చే పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు కాగా, షాపులు, బార్లు, డిస్టిలరీల లైసెన్స్‌ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లుగా ఉంది. షాపుల దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 99 కే మద్యం అందుబాటు లోకి తెచ్చింది. 12 కంపెనీలు ఈ రకం మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. క్వార్టర్‌ రూ.99 అమ్మకా లు ప్రారంభించిన సమయంలో అమ్మకాల్లో వాటి వాటా 30 శాతానికి చేరింది. తక్కువ ధరలో లభిస్తున్న క్వార్టర్‌ రూ.99కు డిమాండ్‌ పెరిగింది. అయితే వీటి అమ్మకాలు పెరుగుతున్నా విలువ తగ్గుతోందని చెబుతున్నారు.. అమ్మకాలకు తగినట్టుగా ఆ మేరకు ఆదాయం రావడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఈ బ్రాండ్ల మద్యాన్ని కొంతమేర నియంత్రించేలా చర్యలు మొదలు పెట్టారు.

కొత్త పాలసీ పై చర్చ
ఇటీవల క్వార్టర్‌ రూ.99 బ్రాండ్ల అమ్మకాల మార్కెట్‌ 20 శాతానికి తగ్గింది. నాటు సారా ప్రభావిత, గ్రామీణ ప్రాంతాలకు ఈ బ్రాండ్లను పరిమితం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తక్కువ ధర బ్రాండ్లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇక, ఈ ఏడాది ఆగస్టుతో ప్రస్తుత బార్‌ పాలసీ ముగుస్తుంది. దీంతో కొత్త బార్‌ పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 870 బార్లు ఉన్నాయి. వాటిలో 42 బార్లు ఎవరూ తీసుకోకపోవడంతో ఖాళీగా మిగిలాయి. గత ప్రభుత్వం బార్లను వేలం విధానంలో కేటాయించింది. ఈసారి వేలం నిర్వహించాలా.. లాటరీ విధానంలో ఎంపిక చేయాలనే అనే అంశం పైన కసరత్తు కొనసాగుతోంది. అమ్మకాలు పెంచి ఫీజుల తగ్గింపుతో వచ్చే నష్టాన్ని భర్తీ చేసేలా కొత్త పాలసీకి అధికారులు తుది రూపం ఇస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorPolicy #APExcise #99LiquorBrands #BarPolicyUpdate #APNews #ExciseReforms #AndhraPradesh